Home > Movie Reviews

లహరి మ్యూజిక్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ...

Dec 02 2016 12:41:20 PM

లహరి మ్యూజిక్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ...
తెలుగు మ్యూజిక్ కంపెనీలలో టాప్ స్థానంలో ఒకటిగా కొనసాగుతున్న లేబుల్ లహరి మ్యూజిక్. జనతా  గ్యారేజ్, సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని అందించిన లహరి మ్యూజిక్ తాజాగా మూడు క్రేజీ సినిమాలహక్కులను సొంతం చేసుకొంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఖైదీ నంబర్150 , గౌతమీపుత్ర శాతకర్ణి , బహుబాలి 2 ఈ మూడు చిత్రాల పాటల హక్కులను లహరి మ్యూజిక్ సొంతం చెసుకోవడం విశేషం...ఈ మూడు చిత్రాలు వేటికవే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో లహరి మ్యూజిక్ భారీ మొత్తం చెలించి హక్కులను సొంతం చేసుకుంది. ఆయా నిర్మాతలతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించేందుకు లహరి మ్యూజిక్ ప్లాన్ చేసుకుంటోంది.....