Home > Movie Reviews

ఎల్‌ 7 మూవీ రివ్యూ

Nov 02 2016 12:41:04 PM

ఎల్‌ 7 మూవీ రివ్యూ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హవా అంతా హర్రర్ సినిమాలదే. ప్రేక్షకులు కూడా ఓన్లీ హర్రర్ మాత్రమే కాకుండా హర్రర్ కామెడీ ఉన్న సినిమాలనైతే బాగా ఇష్టపడుతున్నారు. అలాంటిదే ‘ఎల్-7’. టైటిల్ డబ్బింగ్ సినిమాలా ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం పక్కా లోకలే.. ట్రైలర్‌లో సినిమాలో ఏదో ఉందనిపించినప్పటికీ అసలు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘ఎల్-7’ సినిమా ఎలా ఉంది? అసలు కథేంటి? జనాలను ఎంతమేరకు భయపెట్టగలిగింది??

 

కథ

అరుణ్ (అరుణ్ అదిత్) సంధ్య (పూజా ఝవేరి) ఇద్దరూ కొత్తగా పెళ్ళైన జంట. ఇల్లు వెతుకుతూ ఓ గేటెడ్ కమ్యూనిటీలో చుట్టుపక్కల ఎలాంటి చడీచప్పుడులేని ఓ ఇంట్లో అద్దెకు దిగుతారు. అలా ఆ ఇంట్లో దిగిన వాళ్ళకి మొదటిరోజు నుండి ఏదో ఒకటి చెడు జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అరుణ్ కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడం, అదే టైంలో సంధ్యకు తోడుగా రాత్రిపూట ఇంట్లో ఉండడానికి వాళ్ళ ఫ్రెండ్ మరదలిని వారం రోజులపాటు ఇంట్లో ఉండడానికి తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయిని ఇంట్లో ఉండనీయకుండా వెళ్ళగొట్టేలా చేస్తుంది ఓ అదృశ్య శక్తి. అంతేగాక సంధ్య కూడా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే అసలు ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తి ఏంటి? సంధ్యని ఆ అదృశ్యశక్తి నుండి అరుణ్ ఎలా కాపాడాడు?? అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే సిల్వర్ స్క్రీన్-పై చూడాల్సిందే.

 

ఎనాలసిస్

హర్రర్ థ్రిల్లర్ జానర్‌కు తెలుగులో బాగా క్రేజ్ పెరిగింది. దాంతో ఆ జానర్‌లో వచ్చిన సినిమా ‘ఎల్-7’. ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం దయ్యం. అయితే ఈ దయ్యానికి ఓన్లీ భయపెట్టడమేకాకుండా అప్పుడప్పుడు కామెడీ చేయించడం కూడా రావడంతో సినిమా ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంతేగాక ఈ సినిమాను నడిపించింది కూడా దయ్యమే. దీనికితోడు హీరో అరుణ్ తన భార్యను దయ్యం బారినుండి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం చూడడానికి ఆసక్తి కలిగిస్తుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే దయ్యం ఫ్లాష్‌బ్యాకే. స్టోరీ రొటీన్‌గా ఉన్నప్పటికీ ఫ్లాష్ బ్యాక్ మాత్రం కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. మేకింగ్ విషయంలో కొన్ని చోట్ల దర్శకుడు చేసిన ప్రయోగాలు బాగున్నాయి. ఇంట్లో దయ్యం ఉందో లేదో కనుక్కోవడానికి హీరో చేసిన ఎక్స్పెరిమెంట్ చూడడానికి చాలా బాగా ఉంది. అంతేగాక ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాలో జీవం వచ్చింది. దయ్యాన్ని కనుక్కోవడానికి అరుణ్ చేసిన సీన్ల మేకింగ్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఎంటరైన వెన్నెల కిషోర్ తన కామెడీతో బాగా నవ్వించాడు. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్‌తో రొటీన్ సీన్లను కూడా తన పంచ్ లతో రేంజ్ పెంచగలడని మరోసారి నిరూపించాడు. అంతేగాక సెకండాఫ్‌లో హీరోయిన్ దయ్యంగా మారాక ఇంకాస్త భయపెట్టేలా స్టైలింగ్ చేస్తే సినిమాలో సీరియస్‌నెస్‌ మరింత పెరిగేది. సినిమా ఫస్టాఫ్‌లో హీరో తన ఇంటికి తీసుకొచ్చిన ఫ్రెండ్ మరదలికి గ్లామర్ పోర్షన్ కాస్త ఎక్కువనిపిస్తున్నటైంలో రొమాంటిక్ సాంగ్‌తో మాస్ జనాలను ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నంలా అనిపించింది. అసలు కథను సెకండాఫ్ మొదలయ్యే వరకు చెప్పకుండా సాగదీస్తున్నారా అనిపించినప్పటికీ ఎంటర్‌టైన్ చెయ్యగలిగారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

 

ఎవరెలా నటించారు

కథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో అరుణ్ ఈ సినిమాలో తనదైన స్టైల్‌లో భర్త క్యారెక్టర్ చేశారు. సినిమా స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో లేడీ గెటప్ వేసుకొని అందరినీ మెప్పించాడు. తన భార్యను దయ్యం బారినుండి కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో యాక్టింగ్ చాలా బాగా వచ్చింది. ఎక్కడా అతి చేయకుండా తన క్యారెక్టర్‌కు తగ్గట్లుగా బౌండరీలు దాటకుండా చాలా జాగ్రత్తగా చేశాడు. ఇక హీరోయిన్ పూజా జవేరి ఈ సినిమాలో సంధ్యగా బలమైన రోల్‌లో బాగా నటించింది. ఫస్టాఫ్ అంతా గ్లామర్‌తో ఆకట్టుకున్న పూజ సెకండాఫ్‌లో దయ్యంగా భయపెట్టడానికి ట్రై చేసింది. అంతేగాక వెన్నల కిషోర్ తనదైన స్టైల్‌లో కామెడీ చేసి తన రోల్‌కి న్యాయం చేశాడు.

 

ఓవరాల్

సినిమాల్లో ప్రయోగాలు చేయడం కామనే. అయితే స్టోరీకి తగ్గట్లుగా పిక్చరైజ్ చెయ్యగలిగితే సినిమా హిట్ అవ్వడం ఖాయం. దానికితోడు సినిమాపై ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు సినిమా బాగుంటే మాత్రం చాలా ఈజీగా గట్టెక్కేస్తుంది. అలాంటి సినిమానే ‘ఎల్-7’

 

రేటింగ్: 3/5