Home > Movie Reviews

నందినీ నర్సింగ్ హోం మూవీ రివ్యూ

Nov 02 2016 12:43:41 PM

నందినీ నర్సింగ్ హోం మూవీ రివ్యూ

కథ

చందు (నవీన్) ఓ ఉద్యోగం కోసం వచ్చి తన వద్ద డాక్టర్‌కు ఉండాల్సిన ఏ అర్హతా లేకున్నా ‘నందినీ నర్సింగ్ హోం’లో జూనియర్ డాక్టర్ అవుతాడు. కాలేజ్ ఛైర్మెన్ కూతురైన నందినీ (నిత్య) చందుని సీనియర్ డాక్టర్ వెంకటేశ్వర్లు (జయప్రకాశ్) దగ్గరికి ట్రైనింగ్ కోసం పంపిస్తుంది. అలా జాయినైన చందుకు ట్రైనింగ్‌లో వింత అనుభవాలు ఎదురౌతుంటాయి. చందుతో పాటు ఎప్పుడూ ఓ కాంపౌండర్ (శకలక శంకర్) ‘నందినీ నర్సింగ్ హోం’లో వైద్యం రాకపోయినా పేషంట్లకు వైద్యం చేస్తుంటారు. అలాంటి ‘నందినీ నర్సింగ్‌ హోం’లో కడుపునొప్పి అని ఏడాదిగా హాస్పిటల్ లోనే తిష్ట వేసి డబ్బులకోసం తన రూంని వ్యభిచారం కోసం రెంట్ కు ఇస్తుంటాడు సప్తగిరి. ఛైన్ స్నాచర్ అయిన గణేశ్ (వెన్నెలకిషోర్) పోలీసుల నుండి తప్పించుకోవడానికి కోమాలో ఉన్న పేషంట్‌లా నటిస్తుంటాడు. ఇలాంటి వైరైటీ కేసులను చందు డీల్ చేస్తుంటాడు. అలా ఉన్న పరిస్థితుల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల లిఫ్ట్ లో ఇరుకున్న నందినీని చందు రక్షించి అందరి దగ్గర మార్కులు కొట్టేస్తాడు. అయితే ‘నందినీ నర్సింగ్‌హోం’లో మాత్రం రాత్రిపూట అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో కావాలని చేస్తున్నారనుకొనే టైంలో చందుకి అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయితో లవ్ స్టోరీ ఉందని తెలుస్తుంది. ఆ లవ్ స్టోరీ ఏమైంది? ‘నందినీ నర్సింగ్ హోం’లో చందు ఎలా అడ్జస్ట్ అయ్యాడు? నందినికి చందుకి లవ్ ట్రాక్ ఏమైనా ఉందా? అసలు ‘నందినీ నర్సింగ్ హోం’లో ఏం జరిగింది? అనేది తెలుసుకోవాలంటే ‘నందినీ నర్సింగ్ హోం’ సినిమా చూడాల్సిందే..

 

ఎవరెలా నటించారు

మొదటి సినిమాలోనే చాలా కాన్ఫిడెంట్‌గా నటించి మంచి మార్కులు వేయించుకున్నాడు నవీన్ విజయ్‌కృష్ణ. తనకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా స్టోరీకి తగ్గట్లుగా యాక్టింగ్ స్కిల్స్ చూపించడం వల్ల ఎవరో కొత్త హీరోను చూస్తున్న ఫీలింగ్ ఏమాత్రం రాకుండా జాగ్రత్తపడ్డాడు. నందినిగా నిత్యా నరేష్ చాలా బబ్లీగా నటించింది. తన క్యారెక్టర్‌కు తగ్గట్లుగా ఏమాత్రం ఓవరాక్షన్లు చేయకుండా బాగా నటించింది. ఎప్పటికప్పుడు డబ్బే ప్రధానం అనుకొనే క్యారెక్టర్‌లో శ్రావ్య బాగా నటించింది. నవీన్ శ్రావ్య లవ్ ట్రాక్ చూడడానికి అందంగా అనిపించింది. సీనియర్ డాక్టర్ వెంకటేశ్వర్లుగా జయప్రకాష్ తన స్థాయికి తగ్గట్లుగా నటించారు. వెన్నెలకిషోర్, సప్తగిరి, షకలక శంకర్‌లు కామెడీ డోస్‌ సినిమాకు సరిపోయే విధంగా ఇచ్చారు.

 

ఓవరాల్

‘నందినీ నర్సింగ్ హోం’ సినిమాని ఒక పక్కా కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లోనే ఎక్కడా బౌండరీలు దాటకుండా సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ కథ చెప్పడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు గిరి. ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని అందులో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా చాలా బాగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ విషయంలో నిజంగా మెచ్చుకోవాల్సిందే. లొకేషన్స్ ఎక్కువగా అవసరంలేకుండా ఉన్నదాంట్లో కొత్తదనాన్ని చూపించడంలో డిఓపి సక్సెస్ అయ్యారు. సినిమా మోదలవగానే రెగ్యులర్ తెలుగు సినిమా కమర్షియల్ కామెడీగా అనిపించినప్పటికీ సస్పెన్స్ ఎలిమెంట్‌ని సినిమా ప్రారంభంలోనే మొదలుపెట్టి చివరి వరకు ఎక్కడా రివీల్ అవ్వకుండా స్క్రీన్-ప్లే చాలా బాగుంది. సస్పెన్స్‌ను క్లైమాక్స్ వరకు అలాగే మెయింటైన్ చెయ్యడం ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ తెరకెక్కించడం సినిమాకు ప్లస్ అయ్యింది. నవీన్-శ్రావ్యల లవ్ స్టోరీ చాలా క్యూట్‌గా ఉంది. వెన్నెలకిషోర్, సప్తగిరి, షకలక శంకర్‌లు కామెడీ డోస్‌ సినిమాకు సరిపోయే విధంగా ఇచ్చారు. ఈ ముగ్గురి కామెడీతో సినిమాకు ఓ ఓ మెట్టు ఎక్కించారు. అయితే సినిమా లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రేక్షకుడు ఒకానొక టైంలో నర్వస్ ఫీల్ అవడం, అనవసర పాటలు ఉండడం అనేది సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పుకోవచ్చు. కొన్ని అనవసర సీన్లకు కత్తెర పెడితే ఇంకా సినిమా గ్రిప్పింగ్‌గా ఉండేది. డాక్టర్‌గా బాడీ లాంగ్వేజ్‌ని నవీన్ బాగానే క్యారీ చేసినప్పటికీ ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత కూడా తను ఒక దొంగ డాక్టర్ అనే విషయాన్ని మరిచిపోయి నార్మల్‌గా ఉండడం అనేది కాస్త చికాకుగా అనిపిస్తుంది తప్ప సినిమా మొత్తంలో సస్పెన్స్ ఎప్పుడు రివీల్ అవుతుందోనన్న ఖంగారు చాలా బాగా తెరకెక్కించారు.

 

 


కథ, కథనంలో కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసే సినిమా ‘నందినీ నర్సింగ్ హోం’

 

రేటింగ్ : 3.25 / 5