Home > Movie Reviews

ఇజం: సినిమా రివ్యూ

Nov 02 2016 12:39:34 PM

ఇజం: సినిమా రివ్యూ

కథ

సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్) అనే జర్నలిస్ట్ కథ ఇది. తన తండ్రి కూడా జర్నలిస్ట్ (తనికెళ్ళ భరణి). సత్య మార్తాండ్ 12-14 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక కుంభకోణం గురించిన వార్త రాసినందుకు ఒక రౌడీ ఆయన కాళ్ళు విరగ్గొడతారు. తన తండ్రిని కొట్టిన రౌడీని పెట్రోల్ పోసి తగలెడతాడు ఆ పిల్లాడు. దీనితో కథ మొదలవుతుంది. జావేద్ ఇబ్రహీం (జగపతిబాబు) అని పెద్ద డాన్. దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి ఆయనతో సంబంధాలు ఉంటాయి. ఈ డాన్ అజ్ఞాతంలో ఉన్నాడు, ఏ దేశంలో ఎక్కడున్నాడో తెలియదు అని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. జావేద్ ఇబ్రహీంకు చెందిన బ్యాంక్ ఆఫ్ పారడైజ్ లో ఇండియన్ పొలిటీషియన్స్ తమ బ్లాక్ మనీ దాచుకుంటారు. సత్య మార్తాండ్ ఈ డాన్ గుట్టుని ఎలా ఛేదించాడు, ఆ బ్లాక్ మనీని ఏం చేసాడు అన్నదే మిగతా కథ. (ప్రేక్షకులు థ్రిల్ మిస్ కాకూడనే ఆలోచనతో కథని క్లుప్తంగా ఇచ్చాము.)

 

ఎలా తీసారు?

మన నాయకులు లక్షల కోట్ల రూపాయలు దోచుకుని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని మనకందరికీ తెలుసు మన ప్రధానమంత్రి కూడా అదే మాట చెప్పారు. వికీలీక్స్ పేరుతో జూలియస్ అసాంజే ఇలాంటి రహస్య భాగోతాలని బయటపెడుతున్న సంగతి కూడా మనకి తెలుసు. ఇదే పాయింట్ ని తీసుకుని పూరి జగన్నాథ్ ఒక మంచి కథ రాసుకున్నారు. లాజిక్స్ కి పక్కనబెట్టి, మంచి ఎమోషనల్ గా ఈ కథని చెప్పే ప్రయత్నం చేసాడు. బ్లాక్ మనీ, మాఫియా లాంటి వ్యవహారాలని మరీ ఓవర్ సింప్లిఫై చేసి చెప్పారు కానీ, కథలో ఇంటెన్సిటీ ఉంది. ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ తో సో సో గా నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. అసలు కథ అంతా సెకండ్ హాఫ్ లో ఉంది. సెకండ్ హాఫ్ ని ఎక్కడా బోర్ కొట్టకుండా, ప్రేక్షకుడు లాజిక్ లు వెతుక్కునే చాన్స్ ఇవ్వకుండా, సినిమాతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా పూరి మంచి స్క్రీన్-ప్లే రాసుకుని దాన్ని పక్కాగా అమలు చేసాడు. పూరి డైలాగ్స్ బాగున్నాయి. టెక్నికల్ గా సినిమా గొప్పగా ఏమీ లేదు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన మూడు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

 

ఎలా చేసారు?

కళ్యాణ్ రామ్, ఈ సినిమాకోసం బాగా కష్టపడ్డాడు. లుక్ విషయంలో చాలా బాగా వేరియేషణ్ చూపించాడు. సెకండ్ హాఫ్ లో నటనలో మంచి మార్కులు కొట్టేసాడు. ఇక విలన్ గా జగపతి బాబు డి పవర్ రోల్ ఏమీ కాదు. కూతురంటే చచ్చేంత ప్రేమ ఉన్న డాన్ గా నటన మాత్రం బాగుంది. ఇక హీరోయిన్ అదితి ఆర్య చాలా బాగుంది. అందంగా ఉంది నటన కూడా బాగుంది. పోసాని మరోసారి నవ్వించాడు. వెన్నెలకిషోర్ పాత్ర సెకండ్ హాఫ్ లో కనిపించదు కానీ ఫస్ట్ హాఫ్ లో బాగానే నవ్వించాడు. జర్నలిస్ట్ గా అజయ్ ఘోష్ చాలా అతి చేసాడు. తనికెళ్ళ భరణి ఓకే. జయప్రకాష్ రెడ్డి, రోలర్ రఘు ఓకే.

 

ప్లస్ పాయింట్స్

మంచి కథ

పూరి డైలాగ్స్

కళ్యాణ్ రామ్ నటన.

మైనస్ పాయింట్స్

పెద్ద సమస్యని చాలా సిల్లీగా డీల్ చేయడం.

 

ఒక్క వాక్యం లో చెప్పాలి అంటే: సమాజం మీద ప్రేమ, రాజకీయాల మీద అవగాహన ఉన్నవారికి నచ్చే సినిమా.

 

అంకెల్లో చెప్పాలి అంటే: 3.5/5.