Home > Movie Reviews

అభినేత్రి మూవీ రివ్యూ

Nov 02 2016 12:40:02 PM

అభినేత్రి మూవీ రివ్యూ

తెలుగు, హిందీ, తమిళం మూడు భాషల్లో తమన్నా మెయిన్ లీడ్‌గా ‘అభినేత్రి’, ‘తుటక్ తుటక్ తూటియా’, ‘దేవి’ గా తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఈ రోజు విడుదలైంది. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్‌లు మెయిన్‌రోల్స్ చేసిన ఈ సినిమాకు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ప్రమోషన్లు జరగడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది… ప్రేక్షకుల అంచనాలను ఎంతమేరకు అందుకుందో తెలుసుకుందాం.

 

కథ :

ముంబైలో పనిచేసే కృష్ణ (ప్రభుదేవా) వెస్ట్రన్ స్టైల్లో ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా చేసుకుంటేనే ముంబైలో తను ఉద్యోగం చేసే దగ్గర తనకు గౌరవం పెరుగుతుందని అనుకుంటూ పెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ తను అనుకున్న విధంగా కాకుండా ఓసారి ఊరికి వెళ్లినప్పుడు ఫ్యామిలీ ఒత్తిళ్లతో దేవి(తమన్నా)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే దేవి పల్లెటూరి అమ్మాయిలా ఉండడంతో కృష్ణకు ఏమాత్రం నచ్చదు. అయినప్పటికీ దేవిని ముంబైకి తీసుకెళ్ళి ఓ పాత అపార్ట్మెంట్లో దేవిని ఉంచుతాడు. అలా ఉంచితే తన పెళ్లి విషయం బయటకు తెలీదని అనుకుంటాడు కృష్ణ. ఎలాగైనా దేవిని ఒప్పించి తిరిగి ఊరికి పంపిచేద్దామనుకుంటే ఆ పాత అపార్ట్‌మెంట్‌లో ఉన్న దేవి వేరే ఎవరిలాగనో ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో రాజ్ (సోనూసూద్) దేవిని తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటాడు. అయితే దేవి ఎందుకలా ప్రవర్తిస్తుంటుంది.? దేవికి ఏదైనా దయ్యం పట్టిందా? ఒకవేళ దయ్యం పడితే అది ఎవరిమీదైనా రివెంజ్ తీర్చుకుందా అన్నదే కథ.

 

ఎవరెలా చేశారు:

చాలాకాలం తర్వాత ప్రభుదేవాను సిల్వర్ స్క్రీన్ పైన చూడడం చాలా బాగుంది. తన నటనతో , డ్యాన్సులతో ప్రభుదేవా సినిమాలో తన క్యారెక్టర్‌లో జీవించేశారు. దెయ్యం ఆవహించిన భార్యను కంట్రోల్ చెయ్యడానికి ప్రభుదేవా పడే కష్టాలు చూడడానికి బాగుంది. ఇప్పటివరకు గ్లామరస్ క్యారెక్టర్లు చేసిన తమన్నా దేవి క్యారెక్టర్‌లో, హీరోయిన్ క్యారెక్టర్‌లోనూ జీవించింది. అయితే దేవి క్యారెక్టర్‌లో తమన్నా నటన అద్భుతంగా ఉంది. ఇక యాంగ్రీ యంగ్ మ్యాన్ సోనూసూధ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ ప్రభుదేవా ఫ్రెండ్‌ది. ఆ క్యారెక్టర్‌ను తెలుగులో సప్తగిరి చేశాడు. ప్రతీ సినిమాలో మాదిరిగా కాకుండా సప్తగిరి ప్రభుదేవా ఫ్రెండ్ పాత్రలో బాగానే నవ్వులు పండించాడు.

 

 

ఎనాలసిస్:

అభినేత్రి సినిమాకు ప్రధానంగా ప్లస్ అయిన అంశం స్క్రీన్ ప్లే. దర్శకుడు విజయ్ కథను చెప్పిన స్టైల్ చాలా బాగుంది. దయ్యం సినిమా అనగానే ప్రేక్షకుడిని బ్యాగ్రౌండ్ స్కోర్లతో భయపెట్టకుండా చాలా బాగా డీల్ చేశాడు. దీనికితోడు హర్రర్ కామెడీ జానర్‌లో కాస్త కేర్ తీసుకొని పనిచేస్తే హిట్ కొట్టచ్చనే ఫార్ములాను విజయ్ బాగా స్టడీ చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో దయ్యం ఉంటుందని చేసిన ప్రచారానికి తగ్గట్లుగా సినిమా తీయలేదు. దెయ్యం ఇంట్రడక్షన్ కూడా చాలా పేలగా ఉంది. అంతేగాక సిట్చ్యువేషనల్ కామెడీ ఉన్నప్పటికీ ఎక్కువలేవు. సినిమాని మూడు భాషల్లో తీయడం వలన ఎడిటింగ్ సరిగ్గాలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఇలాంటి త్రిభాషా చిత్రలకు ముఖ్యంగా లోపించే అంశం పాటలు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. పాటలు వింటున్నంతసేపు తెలుగు సినిమా పాటల్లాగా కాకుండా డబ్బింగ్ పాటల్లాగా అనిపిస్తుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంది. డ్యాన్సుల విషయంలో ఎలాంటి పేరు పెట్టాల్సిన అవసరంలేదనిపించింది. ‘చిల్..’ పాటలో వేసిన స్టెప్లులు ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి. ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ ‌గా ఉన్నాయి.

ఓవరాల్ : అభినేత్రి దయ్యం కథ అయినప్పటికీ మిమ్మల్ని ఎక్కడా భయపెట్టదు.

 

రేటింగ్ : 3 / 5