Home > Movie News

రూమర్లపై స్పందించిన ప్రేమమ్ హీరోయిన్.

Nov 02 2016 11:24:28 AM

రూమర్లపై స్పందించిన ప్రేమమ్ హీరోయిన్.
మలయాళ ప్రేమమ్‌తో రాత్రికి రాత్రే సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా మారిపోయింది బెంగుళూరు బ్యూటీ సాయిపల్లవి. ఆ ఒక్క సినిమా దెబ్బతో ఈ అమ్మడికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. కానీ తొందరపడి వాటికి ఓకే చెప్పకుండా తన పాత్ర, కథా బలాన్ని బట్టి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది సాయి. అయితే హీరోయిన్‌గా ఎంత పేరు వస్తుందో..అదే స్థాయిలో రూమర్లు రావడం ఇండస్ట్రీలో కామన్. ఇలాంటి వాటికి సాయిపల్లవి కూడా మినహాయింపు కాదు. తనకు నచ్చని సంభాషణలు పలకనని, అలాగే తనకు కంఫర్ట్‌గా లేని దుస్తులు వేసుకోనని పల్లవి కండీషన్లు పెడుతోందని కోలీవుడ్ మీడియాలో వినిపించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా సాయిపల్లవి చెవిన పడింది..దీనితో రూమర్లపై నోరు విప్పింది..నేను ఇంకా కోలీవుడ్‌లో వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు నాపై ఫిర్యాదులు చేసే ఛాన్స్ ఉండదు. ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్థం కాదు. ఐతే ఇలాంటి వాటిని నేను పట్టించుకోను అని స్పష్టం చేసింది సాయి పల్లవి.